కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలో పోగొట్టుకున్న మూడు తులాల పుస్తెలతాడును బాధితురాలికి పోలీసులు అప్పగించారు. ఈ నెల 24న సాయంత్రం సింగరాయపల్లి ( Singaraipalli ) గ్రామానికి చెందిన చిన్నం వెంకటలక్ష్మి అనే వృద్ధురాలు కామారెడ్డి పట్టణానికి కిరాణా దుకాణంలో వస్తువులు తీసుకుంది. ఆమె చేతిపర్సు (Hand Bag) పోగొట్టుకుంది.
ఇంటికి వెళ్లి చూడగా పర్సు కనిపించకపోవడంతో పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పర్సులో మూడుతులాల బంగారు( Gold) పుస్తెలతాడు ఉన్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొందని సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
కిరాణ దుకాణం వద్ద ఉన్న సీసీ టీవీ కెమెరాలను పరిశీలించగా గడ్డమీది తండా, కొండాపురం, సిరికొండ మండలానికి చెందిన భూక్య కాశీరాం, భూక్య రంభ అనే దంపతులకు పుస్తెలతాడు దొరికినట్టుగా తెలుసుకొని వారిని స్టేషన్కు పిలిపించినట్లు వెల్లడించారు. వారికి లభ్యమైన పర్సు, పుస్తెలతాడును అందజేశారని వివరించారు. ఈ సందర్భంగా పుస్తెలతాడును అప్పగించిన కాశీరాం దంపతులను , పోలీస్ కానిస్టేబుళ్లు రాజు, విజయ్, విశ్వనాధ్, నరసింహులును బాధితురాలు కృతజ్ఞతలు తెలిపింది.