Suravaram Sudhakar Reddy | కోటగిరి, ఆగస్టు 23 : పేద ప్రజల కోసం, కార్మికులు కర్షకుల కోసం నిరంతరం పోరాడిన మహానీయుడు సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అని సీపీఐ కోటగిరి మండల కార్యదర్శి విఠల్ గౌడ్ అన్నారు. అమరజీవి సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల శనివారం కోటిగిరి మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు సంతాపం తెలియజేశారు.
ఈ సందర్భంగా విఠల్ గౌడ్ మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ సభ్యుడి నుండి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారని గుర్తు చేశారు. పేద ప్రజల కోసం కార్మికులు, కర్షకుల కోసం నిరంతరం పోరాడిన మహానీయుడని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నల్గొండ ఎంపీగా కొనసాగారని, నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్యలను పార్లమెంట్లో గళం విప్పిన మహానీయుడు అని అన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి తుది శ్వాస ఉన్నంత వరకు పేద ప్రజల కోసం పోరాడిన మహనీయుడన్నారు.
ఈ సందర్భంగా మండల కమిటీ తరఫున వారికి ఘన నివాళులు తెలిపారు. సీపీఐ ఒక మహానీయుని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల నాయకులు నల్ల గంగాధర్, గుడాల రాములు, నీలి శంకర్, గుజ్జాల రాజు తోట సాయిలు, హనుమాన్లు, మక్కయ్య తదితరులు పాల్గొన్నారు.