ఆర్మూర్‌టౌన్, మార్చి 28: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. ఆయనను అరెస్టు చేయొద్దని మోకిలా పోలీసులను ఆదేశించింది. తన భూమిని లాక్కున్నారని సామ దామోదర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీవన్‌రెడ్డితో పాటు కుటుంబ సభ్యులపై గతంలో మోకిలా పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై జీవన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
తమపై నమోదైన కేసులను కొట్టి వేయాలని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే, భార్యకు, తల్లికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు జీవన్‌రెడ్డి పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. జీవన్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్గి, నిరంజన్‌రెడ్డి వాదించారు. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం జీవన్‌రెడ్డికి ఊరట కల్పిస్తూ ఆయనను అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.