వినాయకనగర్, మే 3: నిజాంషుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని కాంగ్రెస్ చెప్పడం కేవలం ఎన్నికల స్టంటేనని ఎంపీ అర్వింద్ విమర్శించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో కలిసి ఆయన శుక్రవారం బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఫ్యాక్టరీ తెరవాలంటే రూ.800 కోట్లు అవసరమని, కానీ కాంగ్రెస్ సర్కారు కేవలం రూ.42 కోట్లు విడుదల చేయడం రైతులను మభ్యపెట్టేందుకేనని తెలిపారు. ఎన్నికల్లో ఓట్ల కోసమే మరో కొత్త నాటకానికి తెర లేపారన్నారు. పని చేయని మెషిన్లను ఫ్యాక్టరీ నుంచి మరోచోటుకు తరలించి, ఎన్ఎస్ఎఫ్ భూములను కబ్జా చేసేందుకు రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.