బాన్సువాడ రూరల్ : బాన్సువాడ మండల కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గిరిజనుల ఆరాధ్యదైవం సేవాలాల్ మహారాజ్ (Sevalal Maharaj ) జయంతిని శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ (Sub Collector) కిరణ్మయి సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. సేవాలాల్ మహారాజ్ సూచనలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో సిబ్బంది అంజు, యెంబరి శ్రీనివాస్, రజనీకాంత్, తదతరులు పాల్గొన్నారు.