బాన్సువాడ : కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు కష్ట పడి చదువుకోవాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి (Sub collector Kiranmayi )సూచించారు. మంగళవారం సబ్ కలెక్టర్ ఆకస్మికంగా పట్టణంలోని బాలికల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు. మధ్యాహ్నన భోజనాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పుస్తకాలు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం లభిస్తుందని తెలిపారు. కావున విద్యార్థులు కష్టపడకుండా ఇష్టంగా చదవాలన్నారు. విద్యతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని సూచించారు. ప్రతి ఒక్కరు ఓ లక్ష్యాన్ని ఏర్పరుచుకొని అందుకు అనుగుణంగా చదవాలన్నారు. బాగా చదివి ఉన్న ఊరు, కన్న తల్లిదండ్రులకు పేరు తీసుకు రావాలని సూచించారు.