Munnurukapu Sangam | భిక్కనూరు, మే 13 : మున్నూరు కాపు సంఘం రాష్ర్ట ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్ తెలిపారు. కామారెడ్డి జిల్లా మున్నూరు కాపు సబ్ కమిటీ సమావేశం జిల్లా కార్యాలయంలో ఆకుల శ్రీనివాసరావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ మాట్లాడారు. మే 4న రాష్ర్ట కార్యవర్గ సమావేశాన్ని రద్దు చేశామని, త్వరలోనే రాష్ట్రానికి ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
ఇందుకు గాను ప్రతీ గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, మండల అధ్యక్షతన ప్రధాన కార్యదర్శితో జిల్లా అధ్యక్షులు సమావేశం ఏర్పాటు చేసి జాబితాను సిద్ధం చేసుకోవాలని సూచించారు. గ్రామ అధ్యక్షులు నేరుగా రాష్ట్ర ఎన్నికల్లో పాలుపంచుకోవడం వల్ల ప్రతీ గ్రామంలోని మున్నూరు కాపు సంఘం బలపడుతుందని చెప్పారు. అందుకుగాను అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా అమెరికా పర్యటనకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న వారికి తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెట్టి గాడి అంజయ్య, మండల కో ఆర్డినేటర్ వెంకటరాజు, రమేష్, యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, బిక్కనూర్ మండల ప్రధాన కార్యదర్శి ముదాం శ్రీధర్, కోశాధికారి ఆంజనేయులు, ఉపాధ్యక్షులు సంకరి రాజలింగం తదితరులు పాల్గొన్నారు.