బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో సంక్షేమానికి పెద్దపీట
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో సంక్షేమానికి పెద్ద పీట వేసిందని పార్టీ రాష్ట్ర నాయకుడు కోటపాటి నర్సింహానాయుడు అన్నారు. మంగళవారం ఆయన కమ్మర్పల్లి మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్,
- అభివృద్ధ్ది కొనసాగాలంటే వేముల ప్రశాంత్‌రెడ్డి గెలవాలి
- పార్టీ రాష్ట్ర నాయకుడు కోటపాటి నర్సింహానాయుడు
కమ్మర్పల్లి, అక్టోబర్ 17: బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో సంక్షేమానికి పెద్ద పీట వేసిందని పార్టీ రాష్ట్ర నాయకుడు కోటపాటి నర్సింహానాయుడు అన్నారు. మంగళవారం ఆయన కమ్మర్పల్లి మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్ బద్దం రాజేశ్వర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 93 లక్షల మందికి రూ.5 లక్షల ప్రమాద బీమా పథకం పేదలకు కష్ట కాలంలో ఆర్థికంగా ఆదుకుంటుందన్నారు.93 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం పథకం పేదలపై కేసీఆర్‌కు ఉన్న ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఇలా ఎన్నో సంక్షేమ పథకాల కొనసాగింపు, పెంపు, కొత్త సంక్షేమ పథకాలతో కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోను ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయిన కిషన్ రెడ్డి పార్టీలు ఒక వైపు… తెలంగాణను తెచ్చి దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపిన కేసీఆర్ మరో వైపు ఉన్నారన్నారు. బాల్కొండ నియోజక వర్గంలో రోజుకో పార్టీ మారే నాయకుడు ఒక వైపు..23 ఏండ్లుగా ఉద్యమ నాయకుడిని, ఉద్యమ పార్టీని వీడక బాల్కొండను మరో సిరిసిల్ల, గజ్వేల్‌లా తీర్చిదిద్దుతూ పోతున్న వేముల ప్రశాంత్ రెడ్డి మరో వైపు ఉన్నారన్నారు. ప్రజలు ఈ విషయాలన్నింటినీ గమనించాలని కోరారు. రుణమాఫీపై రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. సమావేశంలో పార్టీ నాయకులు మైలారం సుధాకర్, గడ్డం స్వామి, బద్దం రాజ శేఖర్, చితం గణేశ్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

