ఆర్మూర్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్‌రెడ్డిని (Jagadishwar Reddy) అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఆర్మూర్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను ( Government Effigy ) దహనం చేశారు. బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు పూజ నరేందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
నరేందర్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నించే గొంతుకను నొక్కడం సరికాదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సూక్కి సుధాకర్, ఆర్మూర్ మండల యువజన అధ్యక్షులు అగ్గు క్రాంతి, సీనియర్ నాయకులు నచ్చు చిన్నరెడ్డి, అల్లూరు గంగారెడ్డి, ఇందూర్ విజయ్, శేఖర్,మోహన్ , సత్యనందా, మైనార్టీ నాయకులు హర్షద్, సైఫ్ తదితరులు పాల్గొన్నారు.