గాంధారి, జూలై 8: రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన జూనియర్ లెక్చరర్ల పరీక్షా ఫలితాల్లో కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరల్తండాకు చెందిన బర్దావల్ మేఘరాజ్ రాష్ట్రస్థాయి మొదటిర్యాంకు సాధించాడు. హిస్టరీ సబ్జెక్టులో 450 మార్కులకు 367.7 మార్కులు సాధించాడు. మేఘరాజ్ వరకు గాంధారిలో చదివాడు. నిజామాబాద్ జీజీ కళాశాలలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తిచేశాడు. మారుమూల తండాకు చెందిన మేఘరాజ్ జూనియర్ లెక్చరర్ పరీక్షా ఫలితాల్లో మొదటి ర్యాంకు సాధించడంతో తండావాసులతోపాటు పలువురు అభినందించారు.