నస్రుల్లాబాద్ : కామారెడ్డి ( Kamareddy ) జిల్లా బీర్కూరు శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో ఆరు రోజులుగా కొనసాగిన బ్రహ్మోత్సవాలు (Brahmotsavams ) ఆదివారం ముగిశాయి. శ్రీలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దశమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీవారు పుష్కరిణీలో చక్రస్నానం నిర్వహించారు.
తెలంగాణ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ( Pocharam Srinivas Reddy ) కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. స్వామివారిని పుష్కరిలో చక్రస్నానం అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు పుష్కరిణీలో స్నానం ఆచరించారు. ఈ కార్యక్రమంలో పోచారం సుబ్బు రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.