మోర్తాడ్, నవంబర్ 7 : తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు మళ్లీ వరద పెరిగింది. శుక్రవారం ఉదయం అంతంత మాత్రమే వచ్చిన ఇన్‌ఫ్లో.. సాయంత్రానికి 59,454 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో 16 వరదగేట్లు ఎత్తి 50వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 8 వేలు, సరస్వతీ కాలువకు 650, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా, 573 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వెళ్తున్నది. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగుల (80.5 టీఎంసీలు)తో నిండుకుండలా మారింది.