Nizamabad | శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలో సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గత మూడు రోజులుగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన నిర్వహించారు.
ఉదయం 8 గంటలకు స్వామీవారి పాదుకార్చన, పల్లకీకసేవ, భజన కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం బోధన్ జిల్లా ప్రభుత్వ దవాఖానాలో సుమారు వందమందికి పులిహోర పొట్లాలను పంపిణీ చేశారు. సాయంత్రం భజన, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారులకు బహుమతులను ప్రధానం చేశారు. రాత్రి డోలారోహన, తీర్థ ప్రసాద వితరణ తో కార్యక్రమాలు ముగిసాయి. ఈ ఉత్సవాల్లో సత్యసాయి సేవాసమితి ప్రతిని్థులు విశేష సేవలు అందించారు. కార్యక్రమాలను కన్వీనర్ గోపాల్ రెడ్డి, సేవాసమితి ప్రతినిధులు పర్యవేక్షించారు.