ఆధ్యాత్మిక సేవలో ఆత్మారాం మహరాజ్
నేటి సమాజంలో డబ్బుల సంపాదనే ధ్యేయంగా ఎవరికి వారే తమ వృత్తులను కొనసాగిస్తున్నారు. డబ్బుకు ఇచ్చే ప్రాధాన్యత మానవ విలువలకు, దైవిక సంబంధాలకు తక్కువయ్యాయనే చెప్పవచ్చు. కానీ, ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీరామ మఠం వంశజులు, చిలుకూరు శివాలయం ప్రధాన అర్చకుడు శ్రీరామదాసి సురేశ్ ఆత్మారాం చేస్తున్న కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
- పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ
- హైందవ సంప్రదాయ పరిరక్షణకు కృషి
- దాతల సహకారంతో అర్చకునిగా విశిష్ట కార్యక్రమాలు
- ఆదర్శంగా నిలుస్తున్న శ్రీ రామదాసి సురేశ్ ఆత్మారాం మహరాజ్
నేటి సమాజంలో డబ్బుల సంపాదనే ధ్యేయంగా ఎవరికి వారే తమ వృత్తులను కొనసాగిస్తున్నారు. డబ్బుకు ఇచ్చే ప్రాధాన్యత మానవ విలువలకు, దైవిక సంబంధాలకు తక్కువయ్యాయనే చెప్పవచ్చు. కానీ, ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీరామ మఠం వంశజులు, చిలుకూరు శివాలయం ప్రధాన అర్చకుడు శ్రీరామదాసి సురేశ్ ఆత్మారాం చేస్తున్న కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
– శక్కర్‌నగర్, డిసెంబర్ 10
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ రామమఠం వందల ఏండ్ల క్రితం సమర్ధరామదాసు స్వామీజీ చేతుల మీదుగా ఏర్పాటు చేశారని ప్రాశస్త్యంలో ఉన్నది. కాగా, ఈ మఠాన్ని పట్టించుకునే వారు లేక, పలువర్గాల కలహాలతో 20 ఏండ్ల క్రితం రామదాసి కుటుంబీకులు గ్రామానికి దూరంగా వెళ్లారు. వారిలో ఒకరైన శ్రీ సురేశ్ ఆత్మారాం మహరాజ్ మఠం జీర్ణోద్ధరణకు శ్రీకారం చుట్టారు. గ్రామస్తుల సహకారం కోరుతూ తాను ఉంటున్న చిలుకూరు, హైదరాబాద్‌లోని భక్తబృందం, దాతల సహకారంతో జీర్ణోద్ధరణ చేశారు. నాటి నుంచి ఎడపల్లి మండల కేంద్రంలో శ్రీరామ నవమి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య కొనసాగుతున్నాయి.
పలు ఆలయాల జీర్ణోద్ధరణ..
ఎడపల్లి గ్రామానికి దూరంగా వెళ్లిన రామదాసి రాజారాం మహరాజ్ కుమారుల్లో ఒకరైన శ్రీరామదాసి సురేశ్ ఆత్మారాం మహరాజ్ మొదటగా ఎడపల్లి శ్రీరామ మఠం జీర్ణోద్ధరణకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఆయన శ్రీరామ మఠాన్ని నూతనంగా నిర్మించి కార్యక్రమాలు పునఃప్రారంభించారు. ఈ దేవాలయమే కాకుండా పలు శిథిలావస్థకు చేరిన దేవాలయాలను పునర్నిర్మించారు. బోధన్- నిజామాబాద్ రహదారి పక్కన అంబం, నర్సాపూర్ గ్రామాల మధ్య ఓ చెట్టు కింద శిథిలావస్థలో ఉన్న హనుమాన్ మందిరాన్ని చూసిన ఆయన.. ఆలయ నిర్మాణానికి నడుంబిగించారు. 13ఏండ్ల క్రితం ఈ ప్రాంతంలో సుమారు రూ.25లక్షల వ్యయంతో ఆలయాన్ని నిర్మించారు. రామమందిరం, నర్సాపూర్ హనుమాన్ మందిరాల్లో పూజా కార్యక్రమాలకు అర్చకులను నియమించారు. ఇటీవలే బోధన్ పట్టణం శక్కర్‌నగర్‌లో నిజాం చక్కెర కర్మాగారం కొనసాగే కాలంలో భక్తులు, అధికారుల సహకారంతో గ్రామ దేవతలతో కూడిన త్రిశక్తి ఆలయాన్ని నిర్మించారు. కాలక్రమేనా ఆలయం శిథిలావస్థకు చేరడంతో కాలనీకి చెందిన కొందరు తమ ఆలయ జీర్ణోద్ధరణకు సురేశ్ ఆత్మారాం మహరాజ్‌ను సంప్రదించారు. ఈ విషయంపై స్పందించిన ఆయన ఆలయాన్ని పునర్నిర్మించారు. నాలుగు నెలల క్రితం ఆలయ పునః ప్రతిష్ఠాపన మహోత్సవాలను ఆయనే స్వయంగా నిర్వహించారు. పలు పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు సురేశ్ ఆత్మారాం మహరాజ్ అందించిన సేవలు విశిష్టమైనవని పలువురు అభినందిస్తున్నారు.
స్వచ్ఛంద కార్యక్రమాలు..
- ఎడపల్లి శ్రీరామ మఠం ఆధ్వర్యంలో హైందవ ధర్మ పరిరక్షణలో భాగంగా ఏటా నిజామాబాద్ పెద్ద రామమందిరం నుంచి ఎడపల్లి శ్రీ రామమఠం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. సుమారు 15 ఏండ్ల నుంచి భక్తబృందంతో కలిసి పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
- ఏటా పదో తరగతి విద్యార్థులకు చిలుకూరు శివయ్య అనుగ్రహం పేర పెన్నులు, పరీక్ష అట్టలు, నోటు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు.
- బోధన్ పరిసర ప్రాంతాల్లో అక్బర్‌నగర్ ఆంజనేయ స్వామి ఆలయం, రుద్రూర్ శివాలయం, పోచారం నల్ల హనుమాన్ మందిరాల అభివృద్ధికి తనవంతు సేవలు అందించారు.
- రెండున్నర సంవత్సరాలుగా బోధన్ పరిసర ప్రాంతాల్లో దేవాదాయశాఖ పరిధిలోని లేని పలు ఆలయాల్లో దీపారాధనకు నూనె పంపిణీ చేస్తున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

