రామారెడ్డి, నవంబర్ 24: మండలంలోని ఇస్సన్నపల్లి- రామారెడ్డి గ్రామాల్లో వెలసిన శ్రీ కాలభైరవస్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐదురోజులపాటు ఉత్సవాలు కొనసాగగా.. ఆదివారం ఉదయం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయం నుంచి రథయాత్రను ప్రారంభించగా.. రెండు గ్రామాల ప్రజలు, మహిళలు మంగళహారతులతో పాల్గొన్నారు.
రథోత్సవం అనంతరం ఆలయ ప్రాగణంలో శ్రీ కౌలాస్ మహంత్ స్వామి వారి ఆధ్వర్యంలో అగ్నిగుండాలు నిర్వహించారు. భక్తులు ఓం ఓం భైరవ అంటూ అగ్నిగుండాలను దాటారు. గ్రామంలో చక్కర తీర్థం రెండు రోజలపాటు కొనసాగనున్నది. సీఐ రామన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బందోబస్తును కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వర్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో బూర్ల ప్రభురాంచంద్రం, ఆలయ పూజారులు శ్రీనివాస్‌శర్మ, వీర శైవులు జంగం ప్రభాకర్‌స్వామి, వంశీ శర్మ, ఆలయ సిబ్బంది నాగరాజు, యాదగిరి, భరత్ తదితరులు పాల్గొన్నారు.