Kotagiri | కోటగిరి, నవంబర్ 28 : కోటగిరి మండల కేంద్రంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి పడి పూజ శుక్రవారం వైభవంగా నిర్వహించారు. సాత్విక్ కన్నె స్వామి పడి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గణపతి, కుమారస్వామి అనంతరం అయ్యప్ప స్వామి పడి పూజను వైభవంగా నిర్వహించారు. 18 మెట్లకు పూజ చేసి పడి వెలిగించారు.
అంతకు ముందు అయ్యప్ప స్వామికి పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. అయ్యప్ప నామస్మరణతో కాలనీ మొత్తం మార్మోగింది. ఈ కార్యక్రమంలో గురు స్వాములు బీర్కూర్, గంగాధర్, పీ సాయిలు, బర్ల సత్యనారాయణ, అగ్గు హన్మంతు, గంగారంతో పాటు తదితరులు పాల్గొన్నారు.