కోటగిరి : ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించాలని, వారికి ప్రత్యేక రక్షణ చట్టాలు ఉన్నాయని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ విభాగం , మహిళా సాధికారత కేంద్రం నిపుణురాలు కవిత ( Expert Kavita ) అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఆవరణంలో సోమవారం భేటీ బచావో – భేటీ పడావో (Bheti Bachao – Bheti Padao) కార్యక్రమం పై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ , ఆడపిల్లలకు ఈ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తల్లి గర్భంలో శిశువుగా ఉన్నప్పుడే ఆడ శిశువును తుంచి వేయకుండా కేంద్ర ప్రభుత్వం భేటీ బచావో – భేటీ పడావో పథకాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మహిళల సంరక్షణకు , వారి పురోగతికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం కో -ఆర్డినేటర్ సాయిలు, ఐసీడీఎస్ కోటగిరి మండలం సూపర్ వైజర్ కొమురవ్వ, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ప్రత్యేక అధికారిణి సవిత రాణి, అంగన్వాడీ టీచర్లు విజయలక్ష్మి, కళావతి, బాలలక్ష్మి, జమున, తదితరులు పాల్గొన్నారు.