సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం
నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్, కోటగిరి మండల కేంద్రాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులను గురువారం అందజేశారు.
- డబుల్ బెడ్రూం ఇండ్ల బిల్లుల పంపిణీలో స్పీకర్ పోచారం
కోటగిరి/ రుద్రూర్, మార్చి 16: నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్, కోటగిరి మండల కేంద్రాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు మూడు లక్షల రూపాయలతో సింగిల్ బెడ్ రూం స్కీం రానున్నదని తెలిపారు. రైతులు సాగు చేస్తున్న పంటలకు అవసరంమేరకు నీటిని అందిస్తామన్నారు. సాగు నీటి విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వరి ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయనున్నదని తెలిపారు.
ఒకవేళ పచ్చి ధాన్యానికి బయట మంచి ధర ఉంటే అమ్ముకోవచ్చని సూచించారు. రుద్రూర్లో పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కోటగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్ పత్తి లక్ష్మణ్, జడ్పీటీసీ శంకర్‌పటేల్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ సిరాజ్, మాజీ వైస్ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాసరావు, కొల్లూర్ కిశోర్‌బాబు, మండల కన్వీనర్ ఎజాజ్‌ఖాన్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తహసీల్దార్లు శ్రీకాంత్‌రావు, విజయలక్ష్మి, ఎంపీడీవో మనోహర్‌రెడ్డి, హౌసిం గ్ డీఈ నాగేశ్వరావు,వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్లో నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీటీసీ నారోజి గంగారాం, ఎంపీపీ అక్కపల్లి సుజాతానాగేందర్, వైస్ ఎంపీపీ సాయిలు, ఏసీపీ కిరణ్‌కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి బాలరాజు, ఏఈ నాగేశ్వర్రావు, సీనియర్ నాయకులు పత్తిరాము, అక్కపల్లి నాగేందర్, విండో చైర్మన్ సంజీవ్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సంగయ్య, కో-ఆప్షన్ మెంబర్ మస్తాన్, సోషల్‌మీడియా కన్వీనర్ లాల్‌మహ్మద్ పాల్గొన్నారు.
దవాఖానలో ప్రసవాల సంఖ్య పెంచాలి
కోటగిరి సీహెచ్‌సీని స్పీకర్ సందర్శించారు. నెలకు ఎన్ని ప్రసవాలు అవుతున్నాయని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. కోటగిరి సీహెచ్‌సీకి రూ.13 కోట్లు మంజూరయ్యాయని, త్వరలో నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. 50 పడకల దవాఖాన కోసం స్థలాన్ని పరిశీలించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

