వారంలోనే భూ సమస్యల పరిష్కారం
పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. నవీపేట మండల కేంద్రంలో శనివారం ధరణి పోర్టల్‌పై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుతో కలిసి పాల్గొన్నారు.
- ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి
నవీపేట, జూన్ 22: పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. నవీపేట మండల కేంద్రంలో శనివారం ధరణి పోర్టల్‌పై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిష్కారమైన ధరణి మాడ్యూల్ ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా భూసమస్యలపై 46,746 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు 40,271 సమస్యలను పరిష్కరించారన్నారు. మిగతావి త్వరలోనే క్లీయర్ చేయాలని కలెక్టర్ అన్ని మండలాల తహసీల్దార్లకు ఆదేశాలు జారీచేశారని తెలిపారు. నవీపేట మండలంలో 383 దరఖాస్తులకు 302 పరిష్కరించారని, మిగతా వాటిని వారంలో పరిష్కరిస్తారన్నారు. ఆగస్టు నెలలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో రైతులపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నదని అన్నారు. సమావేశంలో నిజామాబాద్ ఆర్డీవో రాజేందర్‌కుమార్, తహసీల్దార్ నారాయణ, ఎంపీడీవో నాగనాథ్, ఎంపీపీ సంగెం శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

