రైస్ మిల్లులపై విజిలెన్స్ విచారణ జరిపించాలి. సిపిఐ డిమాండ్
Kotagiri | కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి సహకార సంఘం లో రైతుల పేరుతో బోనస్ స్వాహా చేసిన సొసైటీ చైర్మన్, రైస్ మిల్లుల పై విచారణ జరిపించాలని సీపీఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ డిమాండ్ చేశారు.
మండల కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విట్టల్ కూడా మాట్లాడుతూ రైతుల పేరిట బోనస్ డబ్బులను అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు ఎండనక వానక ఆరుకాలం కష్టపడి పంట పండిస్తే రైతులకు చెల్లించాల్సిన బోనస్, పక్కదారి పట్టించి రైతుల ముసుగులో రైస్ మిల్లులతో కుమ్ముకై ప్రభుత్వ నుంచి వచ్చిన బోనస్ స్వాహా చేయడం సిగ్గుచేటు అన్నారు. సహకార సంఘం వారు పలువురూ వ్యక్తులపై బోనస్ డబ్బులు జమ చేశారని ఆరోపించారు అధికారులు స్పందించి ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బోనస్ స్వాహా చేసిన వారి నుంచి రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నల్ల గంగాధర్ పాకల సాయిలు, రాములు, లక్ష్మణ్, శంకర్ శివరాజ్, వీరేశం బి గంగాధర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.