Social activist | పోతంగల్, ఆగష్టు 25: సామాజికవేత్త ఎంఏ హకీం బీఆర్ఎస్ పార్టీలో చేరడం హర్షనీయమని పోతంగల్ మండల పార్టీ అధ్యక్షుడు సుధాం నవీన్ అన్నారు. మండలానికి చెందిన సామాజిక సేవా కర్త ఎంఏ హకీం ఈ నెల 28న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.
ఆయన 30 సంవత్సరాలు గా కాంగ్రెస్ పార్టీలో పని చేశారని, మండలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి సామాజిక సేవా కర్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరడం పట్ల ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆరీఫ్, ఏజాస్, ఫెరోజ్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.