Kamareddy | ఇంజిన్‌లో పొగలు.. క్షణాల్లో అగ్నికి ఆహుతైన కారు
జాతీయ రహదారి-161పై పిట్లం మండల కేంద్రం సమీపంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన పిట్లంలో ఆదివారం చోటుచేసుకుంది.
Kamareddy |కామారెడ్డి/పిట్లం 29 : జాతీయ రహదారి-161పై పిట్లం మండల కేంద్రం సమీపంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన పిట్లంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని బస్మత్కు చెందిన యాసిన్ మరో వ్యక్తితో కలిసి బస్మత్ నుంచి హైదరాబాద్‌కు కారులో పిట్లం మీదుగా ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో సాయంత్రం సుమారు 3.30 గంటల సమయంలో పిట్లం వద్దకు చేరుకోగానే కారు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు అప్రమత్తమయ్యారు.
వెంటనే కారులోని వస్తువులు, సామాన్లను తీసుకుని బయటకు దిగారు. వారు కిందకు దిగిన కొద్దిసేపటికే కారు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ఎస్సై బీ ఆంజనేయులు తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
KTR | తీగలగుట్టపల్లిలో పోలీసోళ్లు ఎట్లా వస్తరని రాత్రంతా మేల్కొని ఉన్నం : కేటీఆర్
KTR | ఇది యాచించి తెచ్చుకున్న తెలంగాణ కాదు.. శాసించి తెచ్చుకున్న తెలంగాణ : కేటీఆర్
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Jagadish Reddy | తెలంగాణ నీటి హక్కులను సీఎం తన గురువు చంద్రబాబు చేతిలో పెట్టిండు : జగదీష్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

