నిజామాబాద్: ఆర్టీసీకి చెందిన గరుడ బస్సులో నుంచి పొగలు వచ్చాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన నిజామాబాద్ ఆర్టీసీ బస్సులో వెలుగు చూసింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో ఇలా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు పెద్దగా కేకలు వేశారు.
విషయం గ్రహించిన బస్సు డ్రైవర్.. గాంధారి చౌరస్తా వద్ద బస్సును నిలిపివేశాడు. బస్సు ఆగగానే భయంతో బస్సు దిగేసిన ప్రయాణికులు.. దూరంగా వెళ్లి నిలబడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని, ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు.