ఎట్టకేలకు కదిలిన యంత్రాంగం
ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామంలోని పెద్దవాగు నుంచి అధికార పార్టీకి చెందిన కొందరు ఇసుక అక్రమ తవ్వకాలను యథేచ్ఛగా చేపడుతున్నారు. కొంతకాలంగా కొనసాగుతున్న ఇసుక దందాపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమవుతున్న వరుస కథనాలకు అధికార యం త్రాంగం కదిలింది. అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్నది అధికారుల దాడులతో బట్టబయలైంది. గత సోమవారం నుంచి అధికారపార్టీ నాయకు ల ఆధ్వర్యంలో అక్రమ ఇసుక తవ్వకాలు చేపట్టా రు.
- బట్టాపూర్ పెద్దవాగులో ఆరు ట్రాక్టర్లు, ఒక జేసీబీ పట్టివేత
మోర్తాడ్, ఫిబ్రవరి 22: ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామంలోని పెద్దవాగు నుంచి అధికార పార్టీకి చెందిన కొందరు ఇసుక అక్రమ తవ్వకాలను యథేచ్ఛగా చేపడుతున్నారు. కొంతకాలంగా కొనసాగుతున్న ఇసుక దందాపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమవుతున్న వరుస కథనాలకు అధికార యం త్రాంగం కదిలింది. అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్నది అధికారుల దాడులతో బట్టబయలైంది. గత సోమవారం నుంచి అధికారపార్టీ నాయకు ల ఆధ్వర్యంలో అక్రమ ఇసుక తవ్వకాలు చేపట్టా రు. దీనిపై ‘నమస్తే తెలంగాణ’లో వరుస కథనాలు రావడంతో శనివారం మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు దాడులు చేశారు. ఇసుకను అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఆరు ట్రాక్టర్లు, ఒక జేసీబీని పట్టుకున్నారు. అధికారులు ఎన్ని వే బిల్లులు ఇచ్చారు.. ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వారు తదితర అంశాలను మైనింగ్ అధికారులు పరిశీలించినట్లు సమాచారం. అధికార యంత్రాంగం కదలడంతో ఎట్టకేలకు బట్టాపూర్ పెద్దవాగులో అక్రమ ఇసుక తవ్వకాలకు బ్రేక్పడినట్లయ్యింది.
మరికొన్ని గ్రామాలపై అక్రమార్కుల దృష్టి..
బాల్కొండ సెగ్మెంట్లో పెద్ద ఎత్తున జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వాకలపై ‘నమస్తే తెలంగాణ’ వరు కథనాలతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఇందులో భాగంగా ఉన్నతాధికారి నుంచి వచ్చిన ఆదేశాలతో విజిలెన్స్ అధికారులు శనివారం దాడులు చేసి వాహనాలు సీజ్ చేశారు. అయితే, స్థానిక కాంగ్రెస్ నేతలు మరికొన్ని గ్రామాల్లో ఇసుక వేట కోసం ప్రయత్నాలు చేస్తుండడం, ఇప్పటికే ఆయా మండలాల్లో పోలీసులు, తహసీల్ కార్యాలయ సిబ్బందితో ఒప్పందాలు కూడా చేసుకున్నట్లు సమాచారం. మెండోరా మండలం వెల్కటూరు, ఏర్గట్ల మండలం తొర్తి, మోర్తాడ్ మండలం సుంకెట్, పాలెం, భీమ్‌గల్ మండలంలో బడాభీమ్‌గల్, భీమ్‌గల్, బెజ్జోరా, గోన్‌గొప్పుల తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఓవైపు ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని చెబుతుంటే, మరోవైపు అధికార పార్టీకి చెందిన వారే దొడ్డిదారిలో ఇసుక తోడేందుకు ఏర్పాట్లు చేస్తుండడం చర్చనీయాంశమైంది.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

