ఆర్మూర్, ఫిబ్రవరి 22 : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నవనాథ సిద్ధులగుట్ట ఆలయ కమిటీ చైర్మన్, రైతు ఏనుగు చంద్రశేఖర్‌రెడ్డి(48)బుధవారం తెల్లవారు జామున తన వ్యవసాయక్షేత్రంలో విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చంద్రశేఖర్‌రెడ్డి మృతి చెందిన విషయం తెలియడంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన కుటుంబ సమేతంగా హుటాహుటిన ఆర్మూర్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆయన సతీమణి రజితారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
అనంతరం అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు. చంద్రశేఖర్‌రెడ్డి మరణం బీఆర్ఎస్ పార్టీతో పాటు తనకు తీరని లోటని జీవన్‌రెడ్డి కన్నీరు పెట్టారు.