Shyam Prasad Mukherjee | పొతంగల్, జూన్ 23: జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా పొతంగల్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి సోమవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు హన్మండ్లు శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ గురించి వివరించారు.
కాశ్మీర్ కోసం డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఎన్నో పోరాటాలు చేశారన్నారు. దేశవ్యాప్తంగా అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి తన ప్రాణాలు అర్పించిన గొప్పవ్యక్తి ముఖర్జీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మక్కన్న, బాన్సువాడ నియోజకవర్గం ఓబీసీ మోర్చా కన్వీనర్ నాగం సాయిలు, నాగభూషణం, అశోక్, వెంక గౌడ్, శంకర్, వెంకన్న, రామన్న, లక్ష్మణ్ పటేల్, కార్యకర్తలు పాల్గొన్నారు.