పెద్ద కొడప్గల్ : కామారెడ్డి జిల్లా పిట్లం,పెద్ద కొడప్గల్ మండలాల్లో బుధవారం ఛత్రపతి శివాజీ 395 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. శివాజీ మహారాజ్ (Shivaji Maharaj ) విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శివాజీ చిత్రపటంతో శోభాయాత్ర (Shobhayatra ) నిర్వహించారు. జై భవాని.. జై శివాజీ అంటూ నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. శివాజీ మహారాజ్ దేశానికి రెండు గొప్ప సేవలు అందించారని, ఒకటి ఆర్ష ధర్మాన్ని నిలబెట్టడానికి గోవులను రక్షించడం, స్త్రీలను రక్షించి వారిని గౌరవించడం నేర్పించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో భజరంగ్‌దళ్ సంఘ సభ్యులు, హిందూ సంఘాల సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.