పెద్ద కొడప్గల్(పిట్లo) : కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని బొగ్గులకుంట తండాలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ ( Sevalal Maharaj ) 286వ జయంతిని శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జగదాంబ మాత ,సేవలాల్ మహారాజ్, రామారావు మహారాజ్ కు ప్రత్యేక పూజలు చేసి అన్నదానం నిర్వహించారు. బంజారా పాటలతో మహిళలు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ కాట్రొత్ రవీందర్ నాయక్, బ్యాంక్ మేనేజర్ హరి, ప్రేమ్ , తండపెద్దలు లచ్చిరాం, సకురాం, సవాయి సింగ్ తండా పూజారి సంగ్యా మహరాజ్ , యువకులు పాల్గొన్నారు.