బాన్సువాడ రూరల్ : సేవాలాల్ మహారాజ్ ( Sevalal Maharaj ) జన్మించింది బంజారా కుటుంబంలో అయినప్పటికీ సమాజంలో అందరికీ ఆదర్శప్రాయుడయ్యారని రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి(Pocharam Srinivasa Reddy) పేర్కొన్నారు.
బాన్సువాడ మండలంలోని రాంపూర్ తండాలోని గవాంబదేవి, సేవాలాల్ మహారాజ్ ఆలయంలో సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తండా పెద్దలతో కలిసి భోగ్ బండార్ (Bhogbhandar) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ బోధనలు, సూచనలు అందరూ ఆచరించాలని సూచించారు. సేవాలాల్ సూచించిన మార్గం నేటి సమాజానికి, ముఖ్యంగా యువకులకు ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో తండా పెద్దలు హరిసింగ్, అంబర్‌సింగ్, గోప్యానాయక్, మోహన్ నాయర్, శ్రీనునాయక్, నరేష్ నాయకులు ఎర్యాల కృష్ణారెడ్డి, మోహన్‌రెడ్డి, విజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.