ఖలీల్వాడీ (నిజామాబాద్) : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు (Market yard) రైతుల శ్రేయస్సు దృష్ట్యా మార్కెట్ యార్డులో డైరెక్ట్ కొనుగోలు కేంద్రాన్ని ( Direct purchase center ) ఏర్పాటు చేశామని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి (Chairman Gangareddy) వెల్లడించారు. అన్ని సీజన్లల్లో రైతులు నేరుగా కొనుగోలు కేంద్రంలో పంట ఉత్పత్తులను అమ్ముకునే అవకాశము ఉంటుందని తెలిపారు.
మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదేశాల మేరకు బుధవారం నుంచి మార్కెట్ యార్డులో కొనుగోళ్లను ప్రారంభించామని తెలిపారు. పండించిన ఉత్పత్తులను ఎండబెట్టి, చెత్త చెదారము లేకుండా మార్కెట్ యార్డుకు తీసుకొని వస్తే ఎలాంటి కమిషన్ లేకుండా రైతు ఖాతాలో డబ్బులు పడే అవకాశము ఉందని పేర్కొన్నారు. రైతుసోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.