పెద్ద కొడప్గల్ : కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలోని కాటేపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కరాటే( Karate), కుంగుఫూ (Kung fu) పోటీల్లో రాణించారు. ఆదివారం నిర్వహించిన పోటీలో పాల్గొని బంగారు, వెండి, బ్రాంజ్ పతాకాలను సాధించారని ఎంఈవో ప్రవీణ్ కుమార్ ( MEO Praveen Kumar ) తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో గెలుపొందిన క్రీడాకారులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతాకాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కరాటే కోచ్ శివప్రసాద్, ఉపాధ్యాయులు యాదవ్, శంకర్, లలిత, సునీత, సుజాత, బక్షిరామ్, అశోక్, తదితరులు ఉన్నారు.