Collector Ashish Sangwan | రామారెడ్డి : బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని తల్లిదండ్రులకు కామారెడ్డి కలెక్టర్ ఆసీస్ సంగ్వాన్ సూచించారు. రామారెడ్డి మండల కేంద్రంలోని దళిత వాడలో మంగళవారం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో పాఠశాలలు ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రతీ తల్లిదండ్రులు తమ తమ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని కోరారు.
ప్రభుత్వ బడులలో ఉచిత విద్యతో పాటు దుస్తులు, పుస్తకాలు, స్టేషనరీ ఇతర సామగ్రి ఉచితంగా అందడంతో పాటు శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పారు. అలాగే పౌష్టికారమైన ఆహారం విద్యార్థులకు అందిస్తుందని ఆయన అన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలోతహసీల్దార్ ఉమ, ఎంపీడీవో నాగేశ్వరరావు, మండల విద్యాధికారి ఆనందరావు సర్పంచ్ బండి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.