కంఠేశ్వర్/ కామారెడ్డి, జూలై 5: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. నిజామాబాద్, కామారెడ్డిలోని కలెక్టరేట్లలో జిల్లా అధికారులతో శనివారం ఆయన వేర్వేరుగా సమీక్ష నిర్వహించా రు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వాటా ప్ర కారం వెచ్చించాలని, అవి దుర్వినియోగమైతే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించా రు. ప్రతినెలా చివరి శనివారం పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు. మూడు నెలలకు ఒకసారి డీవీఎంసీ సమావేశాలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు సరైన న్యాయం జరుగేలా చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీలను వేధింపులకు గురిచేసే వారిపై కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సమస్యలపై బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు వినయ్కృష్ణారెడ్డి, ఆశీష్ సంగ్వాన్, సీపీ సాయిచైతన్య, ఎస్పీ రాజేశ్ చంద్ర, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురా లు నీలాదేవి, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియా న్ మావి, నిజామాబాద్ అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, కామారెడ్డి అదనపు కలెక్టర్లు చందర్, విక్టర్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్మహతో, కామారెడ్డి ఆర్డీవో జ్యోతి, ఆయా శాఖల అధికారులు, ఎస్సీ, ఎస్టీ సం ఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.