డిచ్పల్లి, నవంబర్ 30 : డిచ్పల్లిలోని ఏడో బెటాలియన్ ఇన్చార్జి కమాండెంట్‌గా అడిషనల్ కమాండెంట్ పి. సత్యనారాయణ నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. బెటాలియన్ కమాండెంట్‌గా పని చేసిన ఐపీఎస్ అధికారి రోహిణి ప్రియదర్శిని గత నెల 20న కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఆమె స్థానంలో మూడో బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ ఎంఐ సురేశ్‌కు ఏడో బెటాలియన్ బాధ్యతలు అప్పగించారు. ఆయనను ప్రస్తుతం వరంగల్ మామునూర్‌లోని 4వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్‌గా బదిలీ చేశారు. ఏడో బెటాలియన్ అడిషనల్ కమాండెంట్‌గా ఉన్న పి.సత్యనారాయణను ఇన్చార్జి కమాండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు.