కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి( Kotagiri ) మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర మందిరంలో ఆదివారం శ్రీ సంత్ తుకారం (Sant Tukaram) మహారాజ్ బీజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ మహారాజ్, సుద్దులం దొండిబ మహారాజ్ మాట్లాడుతూ ఫాల్గుణ మాసం రెండవ రోజున సాధువు తుకారం మహారాజ్ మృత దేహాన్ని వైకుంఠం నుంచి తొలగించిన రోజున వార్కరి వర్గం తుకారం జన్మదినంగా పాటిస్తుందన్నారు.
సాధువు తుకారం జ్ఞాపకార్థం వివిధ వేడుకలు నిర్వస్తామని తెలిపారు. ఈ సందర్బంగా భజన కీర్తనలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో విజయ్ మహారాజ్, దొండిబ మహారాజ్, గంధపు ప్రకాష్, అశోక్, డాక్టర్ సాయిలు, కప్ప ఎల్లప్ప, శకుంతల, కళావతి ,శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు.