కంఠేశ్వర్/ కామారెడ్డి, డిసెంబర్ 16 : రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే విద్యార్థులతో సహా రోడ్లపై బైఠాయించి సమ్మెను ఉధృతం చేస్తామని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ వారు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతున్నది.
సమ్మెలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ వద్ద సోమవారం చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలుపగా.. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట మహిళా ఉద్యోగులు ముగ్గులు వేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజు, భూపేందర్ మాట్లాడుతూ.. పది రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరారు.
సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాం డ్ చేశారు. నిజామాబాద్లో చేపట్టిన సమ్మె శిబిరంలో ధర్మ టీచర్స్ యూనియన్ జిల్లా నా యకులు బాగేంద్ర మహరాజ్, రాజు, రమేశ్, ప్రవీణ్ మహరాజ్, సంతోష్, నాయకులు హరిచరణ్, దేవానంద్, నర్సింహరావు, నవీన్, శ్రీనివాస్, శేఖర్, విజయ్, గంగామణి, ప్రకాశ్, అఫ్సర్, రవికిరణ్, జాన్ సత్యపాల్, రాణి, సుప్రజ, పద్మ, కామారెడ్డిలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్, మహిళా అధ్యక్షురాలు వాసంతి, హరిప్రియ, కాళీదాస్, శైలజ, వనజ, రాజు పాల్గొన్నారు