Nagireddypet | నాగిరెడ్డిపేట, జులై 27 : వీబీజీ రాంజీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలిప్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు నాగిరెడ్డిపేట ఎంపీడీవో గంగాధర్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫీల్డ్అసిస్టెంట్లు మాట్లాడుతూ మండలం లోని ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ పథకంలో ఉన్న పనులతో పాటు ఇందిరమ్మ ఇల్లు, ఫొటో క్యాప్చర్, ఉపాధి కూలీల అటెండెన్స్, వనమహోత్సవం లాంటి అదనపు పనులు నిర్వర్తిన్నామని చెప్పారు. కానీ తమపై అదనపు పనుల భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. .
అంతేకా తమకు సమయానికి జీతం ఇవ్వడం లేదని, ఇప్పటికైన తమకు ప్రతీ నెలా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే సోమవారం నిర్వహించిన తమ శాఖ సమీక్ష సమావేశం బహిష్కరించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే తమకు మూడు నెలల జీతం రాలేదని, దీంతో తమ కుటుంబాలు గడవడం ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.