kamareddy | మద్నూరు : మండలంలో ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ హుండీని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో గురువారం లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయానికి హుండీ ఆదాయం రూ.50,9370 వచ్చినట్లు అసిస్టెంట్ కమిషనర్ రామారావు తెలిపారు.
ఆలయానికి భక్తులు అత్యధిక సంఖ్యలో వస్తున్నారని, మూడు రాష్ట్రాల కలయిక ఉండడంతో భక్తులు ఎక్కువగా వస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆలయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి సౌకర్యాలు అందజేస్తున్నామని తెలిపారు. ఆలయంలో విధులు నిర్వహించేందుకు సైతం సిబ్బంది ఉన్నారన్నారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ రామ్ పటేల్, ఈవో శ్రీధర్, నాయకులు చౌలావార్ హనుమాన్లు స్వామి, తోటవార్ నాగనాథ్, సిబ్బంది వేణు, కల్పన, సమ్రత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.