మద్నూర్ : మద్నూర్ మండలంలో ప్రసిద్దిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం సలాబాత్ పూర్ ఆంజనేయస్వామి (Salabatpur Temple) ఆలయానికి ప్రభుత్వం రూ. 70 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఆలయ నూతన చైర్మన్ రామ్ పటేల్ ( Chairman Rampatel) ఆధ్వర్యంలో గురువారం మద్నూరు, సలాబత్పూర్, హండేకేలుర్, చిన్న శక్కర్గ గ్రామాలకు చెందిన నాయకులు హైదరాబాద్కు వెళ్లి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు.
మూడు రాష్ట్రాల భక్తుల ఆరాధ్య దైవమైన ఆలయానికి ఇంత పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేసినందుకు సీఎంకు , మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్ రాంపటేల్, నాయకులు హన్మండ్లు స్వామి సాయిలు, రమేష్, గంగాధర్, అశోక్, రాజు, తదితరులు ఉన్నారు.