బాన్సువాడ రూరల్ : గురుకుల పాఠశాలలో అభ్యసిస్తున్న విద్యార్థుల భద్రతకు (Safety) అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని బాన్సువాడ కలెక్టర్ కిరణ్మయి (Sub Collector Kiranmayi) విద్యార్థుల తల్లిదండ్రులకు బరోసా ఇచ్చారు. మండలంలోని బోర్లం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినుల తల్లిదండ్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులతో తాను మాట్లాడానని పాఠశాలలో కావాల్సిన సౌకార్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకు రావాలని విద్యార్థినులకు సూచించారు. తమ పిల్లల భద్రత కల్పించే విధంగా పకడ్బంది చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందచేశారు.