బాన్సువాడ, ఫిబ్రవరి 21: పట్టణంలోని కోట దుర్గాదేవి ఆలయంలో విగ్రహప్రతిష్ఠాపన ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను శనివారం వరకు నిర్వహించనున్నారు. పట్టణానికి చెందిన ఉడుగుల సంజీవ్ గుప్తా కుటుంబీకులు దుర్గాదేవి విగ్రహాన్ని ఆలయానికి అందించగా.. చైతన్య కాలనీలోని వారి ఇంటి నుంచి విగ్రహ ఊరేగింపు చేపట్టారు. ఈ ఊరేగింపును సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించగా.. దుర్గాదేవి దీక్షా స్వాములు, యువకులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేవతామూర్తుల వేషధారణల్లో చిన్నారులు ఆకట్టుకున్నారు. నృత్యాలు, దాండియాతో సందడిచేశారు. చిన్నారులు, మహిళలు, దీక్షా స్వాములతో కలిసి సభాపతి పోచారం కోలాటం ఆడారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, విండో చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు పాత బాలకృష్ణ, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు పిట్ల శ్రీధర్, గురువినయ్కుమార్, గోపాల్ రెడ్డి, కౌన్సిలర్ రమాదేవి, బిట్ల రేణుక, మాజీ ఎంపీటీసీ శ్రీకాంత్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా అధ్యక్షురాలు ఉడుగుల విజయలక్ష్మి, ఉడుగుల శ్రీనివాస్ ,లింగం స్వామి తదితరులు పాల్గొన్నారు.