కంఠేశ్వర్, అక్టోబర్ 28 : నిజామాబాద్ నగరపాలక సంస్థకు నూతన కమిషనర్‌గా ఎస్. దిలీప్‌కుమార్ రానున్నారు. ఇక్కడ కమిషనర్‌గా పనిచేస్తున్న మంద మకరంద్ బదిలీ అయ్యారు. 2023 జూలై 18 నుంచి నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేస్తున్న మకరంద్ బదిలీపై సీసీఎల్ఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా వెళ్లనున్నారు. ప్రస్తుతం మేడ్చల్, మల్కాజిగిరి జడ్పీ సీఈవోగా పనిచేస్తున్న దిలీప్‌కుమార్ నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
కామారెడ్డి, అక్టోబర్ 28 : కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) గా వి.విక్టర్ బదిలీపై రానున్నారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎంఈఏలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న విక్టర్‌ను ఇక్కడికి బదిలీ చేసింది.