రుద్రూర్ : నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ (Rudrur Lions Club) నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా లయన్స్ కేవీ మోహన్ (KV Mohan) , ఉపాధ్యక్షులుగా పత్తిరాము, ఇందూర్ చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా గుండురు ప్రశాంత్ గౌడ్, కోశాధికారిగా ఇమ్రాన్, జీఎస్టీ కోఆర్డినేటర్గా లోగం నాగరాజ్, జీఎంటీ కోఆర్డినేటర్గా వడ్ల నరేష్ ఎన్నికయ్యారు.
జీఎల్టీ కోఆర్డినేటర్గా తుక్కి మహేందర్, ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్ గా రమేష్ యాదవ్, డైరెక్టర్లుగా లయన్స్ శివ శికారి, శ్యాంసుందర్ పహాడే, ప్రవీణ్ కుమార్ కారంగుల, రామ్ రాజ్ వాన్కర్, ఇబ్రహీం, పుట్టి సాగర్, మెంబర్లుగా షేఖ్ తాహెర్,లింగాల శంకర్, సంతోష్ పటేల్, గాండ్ల మధు, కిరణ్ తోట్ల, గంగాధర్ గెంటిల, భాను పంతులును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశ అనంతరం ఎన్నికైన సభ్యులను ఘనంగా సన్మానించారు .