కోటగిరి : సమాజంలో ఉపాధ్యాయ పాత్ర (Teacher Role )చాలా గొప్పదని పోతంగల్ ఇన్చార్జి ఎంఈవో లోల శంకర్ అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో ఆదివారం పోతంగల్ హైస్కూల్ ఉపాధ్యాయుడు అశోక్ పదవీ విరమణ సందర్భంగా అశోక్ శివలక్ష్మి దంపతులను ఉమ్మడి కోటగిరి మండలంలోని ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు శాలువా పూలమాలతో ఘనంగాసన్మానించారు.
ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ ( Retirement ) తప్పనిసరి అన్నారు. పదవి విరమణ వయసుకే తప్ప సేవకు కాదన్నారు. ఉద్యోగ జీవితంలో చేసిన సేవలు పట్ల ప్రజలు, విద్యార్థులు , తల్లిదండ్రులు ఎప్పటికీ మర్చిపోరని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కోటగిరి ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, విండో చైర్మన్ కూచి సిద్దూ, మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, బీమ సాయిరెడ్డి, బర్ల మధు, పీఆర్టీయూ మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు .