బాల్కొండ : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు బయలుదేరిన హైదరాబాద్ వాసుల్లో ఒకరు రోడ్డు ప్రమాదంలో (Road Accident) దుర్మరణం చెందారు. చింతల్‌కు ( Chintal ) చెందిన సంపత్ రాణా తన తోటి స్నేహితులతో కలిసి కారులో ప్రయాగ్‌రాజ్‌కు బయలు దేరారు.
నిజామాబాద్ (Nizamabad) జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ జాతీయ రహదారిపై (National Highway) లారీని ఓవర్‌టేక్‌కు యత్నించి లారీ వెనుక భాగాన ఢీ కొట్టారు. దీంతో కారులో ఉన్న చింతల్‌కు చెందిన వానం సంపత్ రాణా మృతి చెందగా పోతు రమేష్, చంద్రశేఖర్ చారి ,వనం శ్రీనివాస్, రజనీకాంత్, పోతు సాయి విశాల్ గాయపడ్డారు.
క్షతగాత్రులను ఆర్మూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రమాదానికి కారాణమైన లారీ డ్రైవర్‌పై బాల్కొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని బాల్కొండ ఆసుపత్రికి తరలించారు.