ఎల్లారెడ్డి రూరల్: రాష్ట్రంలో రేవంత్ రెడ్డిది కక్షాపూరితమైన పరిపాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ ( BRS ) పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ కుమార్(Adimulam Satish Kumar) అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలోని తెలంగాణ తల్లి ప్రాంగణం వద్ద ప్రధాన రహదారిపై సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) దిష్టిబొమ్మ దహనాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పీకర్ (Speaker ) పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడం అమానుషం అన్నారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదేశాల మేరకు, పార్టీ అధిష్టానం పిలుపుమేరకు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశామన్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకపక్షంగా కుట్ర పన్ని సస్పెండ్ చేశారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు జలంధర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింలు, నాయకులు శ్రావణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఎరుకల సాయిలు, దేవదాస్, ఇమ్రాన్, బర్కత్, బబ్లు, కృష్ణారెడ్డి, మల్లారెడ్డి, నాగం రాజయ్య, అరవింద్ గౌడ్, నాగరాజు తదితరులు ఉన్నారు.