Nizamabad | శక్కర్ నగర్ : బోధన్ మున్సిపల్ డీఈ గా సుదీర్ఘకాలంగా సేవలందించి ఇటీవలే రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ నుంచి పదవీ విరమణ పొందిన డీఈ లింగంపల్లి శివానందం జయలక్ష్మి దంపతులను బోధన్ లో మంగళవారం ఘనంగా సన్మానించారు. పట్టణంలోని తెలంగాణ తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లింగంపల్లి దంపతులకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి మెమెంటోలు అందజేసి సత్కరించారు.
ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ గౌరవ అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ.. లింగంపల్లి శివానందం మునిసిపాలిటీగా డీఈ గా బోధన్ లో సుదీర్ఘకాలం పనిచేసి, పట్టణ అభివృద్ధి కార్యక్రమాల్లో సేవలు అందించారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా, వివాద రహితుడిగా ఆయన అందించిన సేవలు ఎనలేనివని గుర్తు చేశారు. ఆయన శేష జీవితం సుఖశాంతులతో కొనసాగాలని సంఘ నాయకులు, సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు ఎల్ రమేష్, అధ్యక్షుడు పాయల్ శంకర్, కార్యదర్శి కార్వాన్ జహంగీర్, ఉపాధ్యక్షుడు ఆంజనేయులు తోపాటు సభ్యులు సాయిలు, బాబు, జి రమేష్, సంజు, నందకిషోర్, రాజు, యోగి తదితరులు పాల్గొన్నారు.