సమరం మోగించిన స్థానిక ప్రజాప్రతినిధులు
ఉమ్మడి జిల్లాలో వేయికి పైగా గ్రామపంచాయతీల్లో నిరసనలు
తెలంగాణ వడ్లను కేంద్రం కొనాలంటూ తీర్మానాలు
ఏకగ్రీవంగా ఆమోదించిన పాలకమండలి సభ్యులు
నిజామాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న నాటకాలను పటాపంచలు చేసేందుకు సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఊరూరా నిరసనలు వెల్లువెత్తాయి. గ్రామపంచాయతీ పాలకవర్గాలన్నీ శనివారం ప్రత్యేకంగా సమావేశమై కేంద్రప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశాయి. తెలంగాణ వడ్లను కొనాల్సిందేనంటూ ఆమోదించిన తీర్మానాలను నేరుగా పోస్టల్, కొరియర్ సర్వీసుల ద్వారా ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించారు. ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ పిలుపును అందుకున్న అనేకులు ఉదయమే తీర్మానాలను ఆమోదించి నిరసన తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులంతా ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ రైతుల కష్టానికి కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న నాటకాలను పటాపంచలు చేసేందుకు సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఊరూరా నిరసనలు వెల్లువెత్తాయి. గ్రామ పంచాయతీ పాలకవర్గాలన్నీ ప్రత్యేకంగా సమావేశమై ఏకగ్రీవంగా మోదీకి, కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి. ఆమోదించిన తీర్మానాలను నేరుగా పోస్టు, కొరియర్ సర్వీసుల ద్వారా ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించారు. ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ పిలుపును అందుకున్న అనేకులు ఉదయమే తీర్మానాలను ఆమోదించి నిరసన తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులంతా ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ రైతుల కష్టానికి కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వేయికి పైగా గ్రామ పంచాయతీల్లో తీర్మానాల జోరు కనిపించింది. చాలాచోట్ల ఎమ్మెల్యేలు సైతం జీపీ పాలకవర్గ సమావేశాల్లో ప్రత్యక్షంగా పాల్గొని మోదీకి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో పాలుపంచుకున్నారు.
టు నరేంద్ర మోదీజీ..
టు… నరేంద్ర మోదీజీ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండి యా అంటూ సాగిన తీర్మాన కాపీని చాలా మంది పోస్టాఫీసు, ప్రైవేటు కొరియర్ సర్వీసుల ద్వారా ప్రధానమంత్రి కార్యాలయ చిరునామాతో పంపించారు. గత కొంతకాలంగా వడ్ల కొనుగోలు విషయంలో పెడుతున్న కొర్రీలపై తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపిస్తున్నది. మర ఆడించిన బియ్యం కాకుండా నేరుగా వడ్లనే కొనాలంటూ సీఎం కేసీఆర్ డిమాండ్ చేస్తుంటే కేంద్రం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడంపై సర్వత్రా బీజేపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయం అంటే అరిగోస పడిన రైతులు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం రైతుసంక్షేమ పథకాలతో వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నది. 24గంటల కరెంట్, సాగునీరు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో వ్యవసాయం పండుగలా మారింది. ఈ క్రమంలో వరిసాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. ఇలాంటి సమయంలో కేంద్రంలోని బీజేపీ వడ్ల కొనుగోలు విషయంలో కిరికిరి పెడుతున్నది. ధాన్యం కొనం… బియ్యం చేసి ఇస్తే తీసుకుంటామంటూ హేళన చేస్తున్నది. షాపుల్లో ఏది అమ్ముడు పోతే అదే కొంటాం అని వ్యాపారిలా మాట్లాడుతున్నది. కర్షకులకు న్యాయం చేయాలని ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రులు, ఎంపీలను అవమానపర్చారు.
కనికరం లేని కేంద్ర సర్కారు..
ఎనిమిదేండ్ల కిందట నిజామాబాద్, కామారెడ్డిలో యాసంగిలో వరి సాగు చేయాలంటే రైతుల్లో వణుకు పుట్టేది. నీళ్లు లేక, కరెంట్ అందక పంటలు ఎండిపోవుడే తప్పా చేతికి పంట వచ్చేది కష్టమే. ఈ దుస్థితిలో పెట్టుబడి ఖర్చు కూడా తిరిగి రాకపోగా అప్పులు పెరిగే ఆస్కారం ఏర్పడేది. దీంతో రైతులు చేసేది లేక సాగుకు ముఖం చాటేసేది. చిన్న, మధ్య తరహా రైతులెవ్వరూ పంటలు వేసేందుకు ధైర్యం చేసేది కాదు. సామంతులు, బడా బాబులు మాత్రం తమకున్న బోరు బావుల కింద పంటలు సాగు చేసేవారు. నష్టాలు వచ్చినా వారికి అంతగా ఇబ్బందులు ఏర్పడకపోయేది. కానిప్పుడు సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన అనేక చర్యలతో సాగు కాలం ఏడాదంతా కొనసాగుతున్నది. రైతులు వానకాలం, యాసంగికి సంబంధం లేకుండా పనులు చేసుకుంటున్నారు. బీడు భూములన్నీ పచ్చగా మారుతుండడంతో ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్నది. సాగు రంగంలో వచ్చిన ఈ మార్పును కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ జీర్ణించుకోవడం లేదు. రైతులు పండించిన వడ్లను కొనకుండా కిరికిరి పెడుతున్నది.