బాన్సువాడ రూరల్ : త్వరలో జరుగబోయే జడ్పీటీసీ(ZPTC), ఎంపీటీసీ(MPTC) స్థానాలు, ఆయా గ్రామాల ఓటరు లిస్టును (Voter List ) ఎంపీడీవో బషీరుద్దీన్ సోమవారం విడుదల చేశారు. మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఓటర్ జాబితా వివరాలను వెల్లడించారు.
గ్రామాల వారిగా ఓటర్ లిస్టును విడుదల చేస్తున్నామని, ఏమైనా సవరణలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజా ప్రతినిధులు, ఓటర్లకు సూచించారు. ఈ సమావేశంలో ఎంపీవో సత్యనారాయణరెడ్డి , మండల అధికారులు పాల్గొన్నారు.