రుద్రూర్, నస్రుల్లాబాద్, నవంబర్ 15 : దేశంలో ఎక్కడా లేని విధంగా మత్స్యకారుల అభ్యున్నతికి కోసం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో ఉన్న చెరువులో 4 లక్షల 70 వేల చేప పిల్లలను మంగళవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల్లో మహిళలు సైతం సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గంగపుత్రుల సంఘ భవనానికి ప్రహరీ, అదనపు గదుల కొరతను సభాపతి దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి నిర్మించుకోవాలని అనుమతులు జారీ చేశారు. సంఘం సభ్యులు కోరిన విధంగా సీసీ రోడ్డు నిర్మించేలా కృషి చేస్తామని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు డబుల్బెడ్రూమ్ ఇండ్ల బిల్లులు పంపిణీ చేశారు. ప్రభుత్వ కార్యకలాపాలకు, పథకాల అమలుకు ఆటంకం కలిగిస్తే నాన్‌బెయిల్ కేసు నమోదవుతుందని హెచ్చరించారు.
రుద్రూర్ మండల కేంద్రంలో కొనసాగుతున్న కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. భవన నిర్మాణ పనులు జనవరి 14 నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. భవనం ప్రహరీకి నిధులు మంజూ రు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించారు. భవన నిర్మాణ కాంట్రాక్టర్ వాడుకున్న విద్యుత్ బిల్లును చెల్లించలేదని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజూష సభాపతికి ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్ పద్ధతి మార్చుకోవాలన్నారు. స్పీకర్ వెంట మత్స్యశాఖ జిల్లా అధికారి రాజనర్సయ్య, ఎంపీపీ అక్కపల్లి సుజాతా నాగేందర్, జ డ్పీటీసీ నారోజి గంగారాం, ఏఈ నాగేశ్వర్రావు, పార్టీ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, గ్రామ అధ్యక్షుడు తొట్ల గంగారాం, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, వైస్ ఎంపీపీ సాయిలు, తహసీల్దార్ ముజీ బ్, సీనియర్ నాయకులు నాగేందర్ తదితరులు ఉన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమై భోజనాన్ని అందించాలని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని పాఠశాలను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మెనూ ప్రకారం భోజనాన్ని అందిసున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఏఎన్ఎం పోస్టు భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల వెనుక ఉన్న ట్రైబల్ యూత్ సెంటర్ భవనాన్ని గురుకుల పాఠశాల విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. స్పీకర్ వెంట ఎంపీపీ పాల్త్య విఠల్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మాజీద్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ గ్రామ అధ్యక్షుడు బాలకృష్ణ, నాయకులు కంది మల్లేశ్, లక్ష్మీనారాయణ గౌడ్, మైశాగౌడ్ ఉన్నారు.